శర్వానంద్ సినిమాలో అఖిల్ హీరోయిన్

Saturday,February 10,2018 - 11:03 by Z_CLU

శర్వానంద్ సుధీర్ వర్మ సినిమా ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వా సరసన చాన్స్ కొట్టేసింది కళ్యాణి ప్రియదర్శన్. అఖిల్ ‘హలో’ సినిమాతో యూత్ లో క్రేజ్ క్రియేట్ చేసుకున్న కళ్యాణి, ఈ సినిమాతో మరింత బిజీ కానుంది.

డిఫెరెంట్ ఎంటర్ టైనర్స్ తో కరియర్ ని ప్లాన్ చేసుకున్న శర్వానంద్ ని ఈ సినిమాలో మరింత కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రిపరేషన్స్ లో ఉన్నాడు సుధీర్ వర్మ. ప్రస్తుతం కోల్ కతాలో హను రాఘవపూడి సినిమాతో సెట్స్ పై ఉన్న శర్వా, ఈ సినిమాకి ప్యాకప్ చెప్పీ చెప్పగానే సుధీర్ వర్మ సినిమాతో సెట్స్ పైకి వచ్చేస్తాడు.