డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న కల్యాణ్ రామ్

Monday,December 03,2018 - 12:08 by Z_CLU

కల్యాణ్ రామ్ కొత్త సినిమాకు 118 అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ తో లోగోను కూడా విడుదల చేశారు. ఇంతకీ 118 అంటే ఏంటి? కల్యాణ్ రామ్ కు ఈ నంబర్ కు ఏంటి సంబంధం అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇదొక కంప్లీట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు తనకు ఎంతో అలవాటైన సినిమాటోగ్రాఫీని కూడా హ్యాండిల్ చేస్తున్నాడు గుహన్. వీటితో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా గుహన్ వే.

సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేత థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమాను జనవరి మూడో వారంలో విడుదల చేయబోతున్నారు.