Kalyan Ram's Bimbisara - టీజర్ రివ్యూ

Monday,November 29,2021 - 09:55 by Z_CLU

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘బింబిసార’ టీజర్ రిలీజైంది. మొన్నీ మధ్యే ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఆకట్టుకొని బజ్ క్రియేట్ చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు.

ఓ సమూహం తాలుకూ దైర్యాన్ని ఓ ఖడ్గం సాశిస్తే ? అంటూ వాయిస్ ఓవర్ తో కళ్యాణ్ రామ్ రాజు గెటప్ లో నడుస్తూ వచ్చే షాట్స్ తో స్టార్ట్ అయిన టీజర్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ క్లిప్స్ , చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ , సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , గ్రాండియర్ సెట్స్ ఎట్రాక్ట్ చేశాయి.

ఓవరాల్ గా సినిమా థీంని క్రిస్పీ గా చెప్తూ గ్రాండియర్ విజువల్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ తో కట్ చేసిన టీజర్ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొల్పేలా చేసింది. నిర్మాతగా ఇప్పటికే చాలా ప్రయోగాలు చేసిన కళ్యాణ్ రామ్ ఈసారి తన బేనర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే భారీ బడ్జెట్ సినిమాతో రాబోతున్నాడని టీజర్ కట్ చూస్తే క్లియర్ కట్ గా అర్థమవుతోంది.