కళ్యాణ్ రామ్ కి ఇది ఫస్ట్ టైమ్

Saturday,June 22,2019 - 12:03 by Z_CLU

సతీష్ వేగేశ్న సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే సింపుల్ గా సినిమా యూనిట్ మకాం రాజమండ్రికి మార్చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే విలేజ్ బ్యాక్ డ్రాప్స్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో సినిమా చేయాలంటే సతీష్ వేగేశ్న తరవాతే ఎవరైనా… కానీ కళ్యాణ్ రామ్ కి ఇది ఫస్ట్ టైమ్…

అప్పుడెప్పుడో కరియర్ బిగినింగ్ లో 2007 లో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమా చేసినా, అందులోనైనా కొద్దో గొప్పో యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి… కానీ సతీష్ వేగేశ్న సినిమాలో యాక్షన్ కి అవకాశాలు ఆల్మోస్ట్ ఉండవంతే.. అలాంటప్పుడు ఇలాంటి సినిమా కళ్యాణ్ రామ్ కి కొత్తే కదా…

అన్ని సినిమాలు ఒకేలా ఉంటున్నాయి.. అందునా కళ్యాణ్ రామ్ లాంటి డిఫెరెంట్ హీరో దొరికాడు కదా అని సతీష్ వేగేశ్న కొంచెం కథలో మాస్ ఎలిమెంట్స్ ప్లాన్ చేసుకుంటే చెప్పలేం కానీ, ఏది ఏమైనా ఈ కాంబినేషన్ లో కళ్యాణ్ రామ్ ని కొత్తగా చూడొచ్చనే అభిప్రాయమైతే ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

చూడాలి మరీ… ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ ఏం చేసినా కొద్దో గొప్పో కొత్తదనం ఉంటుందనే ఇమేజ్ ఉంది. దానికి తోడు ఇప్పుడు సతీష్ వేగేశ్న మార్క్ ఫ్యామిలీ హీరో అనిపించుకుంటాడా..? లేకపోతే ఫిలిమ్ మేకర్స్ మైండ్ లో ఇంకేమైనా నడిస్తుందా..? ఈ డీటేల్స్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.