మరో సినిమాతో రెడీ అయిన కళ్యాణ్ రామ్

Monday,April 23,2018 - 02:47 by Z_CLU

రీసెంట్ గా M.L.A. తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘నా నువ్వే’ సినిమాతో రెడీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ గ్యాప్ లో తన నెక్స్ట్ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు కళ్యాణ్ రామ్.

లాంగ్ బ్యాక్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ని బిగిన్ చేసిన ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేత థామస్ తో పాటు శాలిని పాండేలను  హీరోయిన్స్ గా ఫిక్స్ చేసుకున్నారు. ఈ సినిమాను రామానాయుడు స్టూడియోస్ లో ఈనెల 25 న మార్నింగ్ 7: 30 కి గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

 

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ K.V. గుహన్ ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ కానున్నాడు. మహేష్ కోనేరు నిర్మిచనున్న ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించి తక్కిన టెక్నీషియన్స్ ఇంకా అనౌన్స్ చేయాల్సి వచ్చింది.