పుట్టినరోజు సందర్భంగా ఇంకో కొత్త సినిమా...

Wednesday,July 05,2017 - 04:13 by Z_CLU

ప్రెజెంట్ MLA (మంచి లక్షణాలున్న అబ్బాయి) తో సెట్స్ పై ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా స్పీడ్ పెంచేశాడు. అటు నిర్మాతగా ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ సినిమాను తెరకెక్కిస్తూనే మరో వైపు హీరోగా MLA షూట్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ త్వరలోనే మరో సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడు. గతంలో సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన 180 సినిమా దర్శకుడు జయేంద్రతో నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు నందమూరి హీరో.

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ ‘Cool Breeze సినిమాస్’ బ్యానర్ పై రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి కళ్యాణ్ రామ్ ను విష్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసి, కొత్త సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు పీ.సీ.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించబోతున్నాడు.