ఎన్టీఆర్ కోసం కళ్యాణ్ రామ్ కొత్త ప్లాన్స్....

Sunday,December 25,2016 - 11:30 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి డైరెక్షన్ లో నటించబోయే సినిమాను నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో తమ్ముడితో ఓ భారీ సినిమాను నిర్మించాలనుకున్న కళ్యాణ్ రామ్ ఎట్టకేలకి ఎన్టీఆర్ తో సినిమాను సెట్స్ పై పెట్టబోతున్నాడు.

  ఇప్పటికే ఎన్టీఆర్ కోసం నిర్మాతగా కథ నుంచి డైరెక్టర్ వరకూ స్పెషల్ కేర్ తీసుకున్న కళ్యాణ్ రామ్  ఈ సినిమాను భారీ రేంజ్ లో నిర్మించాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం కొత్త ప్లాన్స్ కూడా రెడీ చేసుకుంటున్నాడట. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా ను జనవరి నుండి సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు నందమూరి బ్రదర్స్. ఇండస్ట్రీలో సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్న గెటప్స్ లో భారీ పౌరాణిక డైలాగ్స్ తో అలరించనున్నాడని అందుకే ఈ సినిమాకు ‘నటవిశ్వరూపం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్.