కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' జ్యూక్ బాక్స్ రివ్యూ

Monday,May 07,2018 - 02:04 by Z_CLU

కళ్యాణ్ రామ్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఫు ఫ్లెజ్డ్ లవర్ బాయ్ లా చేసిన సినిమా నా…నువ్వే. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ నెల 25 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా నిన్న గ్రాండ్ గా ఆడియో లాంచ్ జరుపుకుంది. శరత్ కంపోజ్ చేసిన ఈ సాంగ్స్ యూత్ ని ఇంప్రెస్ చేయడమే కాదు, సినిమాపై కూడా అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి.

హే..హే.హే..ILU…:  మోస్ట్ యూత్ ఫుల్ సాంగ్. కంప్లీట్ గా మేల్ వర్షన్ లో ఉన్న ఈ సాంగ్ టిప్పు పాడాడు. లవ్ లో పడిన కొత్తలో లవర్స్ మధ్య ఉండే ఫోన్ కాన్వర్జేషన్స్ ని సాంగ్ లా ప్రెజెంట్ చేశాడు శరత్. అనంత శ్రీరామ్ రాసిన ట్రెండీ లిరిక్స్  హమ్ చేయడానికి ఈజీగా ఉండటంతో యూత్ కి ఈజీగా కనెక్ట్ అయిపోతున్నాయి.

నిజమా మనసా…: యాజిన్ నిజార్, M.M. మాన్సి పాడిన సాంగ్ ఇది. కళ్యాణ్ రామ్, తమన్నా కాంబినేషన్ లో ఉండబోయే ఈ సాంగ్ లిరిక్స్  ని  బట్టి తమ   లవ్ ని  రియలైజ్ అయ్యే సిచ్యువేషన్  లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ పాటకి అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశాడు.

రైట్ రైట్ రైట్…: ఓలా.. ఓలా.. ఓలా… అంటూ బిగిన్ అయ్యే ఈ సాంగ్, సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ని ఎలివేట్ చేస్తుంది. ఫాస్ట్ పేజ్ లో యూత్ ఫుల్ గా ఉండే ఈ పాటని టిప్పు పాడాడు. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశాడు.

చినికి చినికి : ఈ సినిమా ఆడియో కన్నా ముందే రిలీజైన ఫస్ట్ సింగిల్ ఇది… సినిమా కంప్లీట్ గా లవ్ ఎంటర్ టైనర్ లా ఉండబోతుందని ఈ సాంగ్ రిలీజైన రోజే కన్ఫమ్ అయిపోయింది. కార్తీక్, సప్తపర్ణ చక్రవర్తి పాడిన ఈ సాంగ్,  ఇప్పటికే సూపర్ హిట్టయింది.

ప్రేమికా : సినిమాలో మోస్ట్ ఇమోషనల్ సాంగ్. సిచ్యువేషన్ ఎగ్జాక్ట్ గా గెస్ చేయడం కష్టమే కానీ, ‘నమ్మకాన్ని శ్వాస లాగ ఉంది నీ నాయికా… ఉన్నచోటే నమ్మకంగా వేచి ఉందిలా రా ఇక” అనే లిరిక్స్ ని బట్టి హీరో, హీరోయిన్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సాంగ్ ని శరత్ పాడాడు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశాడు.

నా నువ్వే : స్లో పేజ్ లో ఉండే టైటిల్ సాంగ్…  ప్రియ మాలి పాడిన ఈ సాంగ్, సినిమాలో తమన్నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండబోతుంది. రామ జోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కి లిరిక్స్ రాశాడు.

హే హే హే ILU :  ఆల్మోస్ట్ జ్యూక్ బాక్స్ లోని ఫస్ట్ సాంగ్ లాంటిదే. సినిమాలో RJ గా కనిపించనున్న  తమన్నా, ఈజీ  గోయింగ్  ఆటిట్యూడ్   ఈ సాంగ్  లో ఎలివేట్ అవుతుంది. రీటా పాడిన ఈ సాంగ్ కి అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశాడు.