Kalyan Ram - కొత్త సినిమా అప్ డేట్స్

Wednesday,October 12,2022 - 02:11 by Z_CLU

Kalyan Ram, Mythri Movie Makers Movie updates

బింబిసార సక్సెస్ తో ఊపుమీదున్న కల్యాణ్ రామ్, అదే ఊపులో మరో సినిమాను కొలిక్కి తీసుకొచ్చాడు. క‌ళ్యాణ్ రామ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది.

రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని న‌వీన్-ర‌విశంక‌ర్ నిర్మాతలు. క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

ఇదొక యాక్షన్ ఎంటర్ టైనర్. అలా అని రొటీన్ కమర్షియల్ కథ కాదు. స్టోరీలైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్ నచ్చి కల్యాణ్ రామ్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. అతనొక్కడే, పటాస్ తర్వాత ఆ స్థాయిలో కల్యాణ్ రామ్ కు పేరు తెచ్చే సినిమాగా ఇది ఉంటుందంట.

kalyanram mythri