కళ్యాణ్ రామ్ MLA రిలీజ్ డేట్

Wednesday,January 17,2018 - 01:43 by Z_CLU

రీసెంట్ గా రిలీజైన కళ్యాణ్ రామ్ MLA టీజర్ ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేసింది. ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టాకీపార్ట్ ని సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించింది. నెక్స్ట్ మంత్ ఫారిన్ కంట్రీస్ లో సాంగ్స్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్న ఫిల్మ్ మేకర్స్, ఈ షెడ్యూల్స్ కి సంబంధించి ప్రిపరేషన్స్ లో బిజీగా ఉన్నారు.

సమ్మర్ రిలీజ్ ని టార్గెట్ చేసుకున్న సినిమా యూనిట్, ఈ సినిమాని మ్యాగ్జిమం మార్చి లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది.

భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సినిమాతో ఉపేంద్ర మాధవ్ డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.