కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూ

Thursday,March 22,2018 - 06:26 by Z_CLU

“ఎం.ఎల్.ఎ(మంచి లక్షణాలున్న అబ్బాయి)” అంటూ రేపే థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఉపేంద్ర దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా గురించి లేటెస్ట్ గా మీడియాతో ముచ్చటించాడు కళ్యాణ్ రామ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

 

ఈ సినిమా కోసం కేర్..రీజన్ అదే

‘ఇజం’ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేశాను. కాని సిక్స్ ప్యాక్ చేయడం వల్ల ఫేస్ లో ఎక్కువ చేంజ్ కనిపించింది. మా ఫ్యామిలీ నుండి కూడా కొన్ని నెగిటీవ్ కామెంట్స్ వచ్చాయి. అందుకే కాస్త బుగ్గలు కనిపించేలా ఈ సినిమా కోసం కేర్ తీసుకున్నాను. అది బాగా వర్కౌట్ అయింది. అందరూ ఈ సినిమాలో లుక్ బాగుందని చెప్తున్నారు.

 

చెప్పగానే కనెక్ట్ అయిపోయాను

ఉపేంద్ర ఈ స్క్రిప్ట్ చెప్పగానే బాగా కనెక్ట్ అయిపోయాను. తను చెప్పిన విధానం కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాను. కథ చెప్పి మంచి లక్షణాలున్న అబ్బాయి ఎం.ఎల్.ఎ అన్నాడు. స్క్రిప్ట్ కి పెర్ఫెక్ట్ టైటిల్ అనిపించడంతో అదే పెట్టేశాం. అంతే కానీ కావాలని పెట్టింది కాదు. ఎండింగ్ లో ఎం.ఎల్.ఎ అవుతాననుకోండి. కాని ప్రత్యేకంగా అనుకోని బాగా డిస్కస్ చేసి పెట్టింది కాదు. కథతో పాటే పుట్టిన టైటిల్.

అదో సందర్భంలో వచ్చే డైలాగ్

ట్రైలర్ లో “నేనింకా రాజకీయం చేయడం మొదలుపెట్టలేదు. మొదలుపెడితే మీరు చేయటానికి ఇంకేం మిగలదు ” అనే డైలాగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చించి. నిజానికి ఓ సందర్భంలో విలన్ కి కౌంటర్ ఇచ్చే డైలాగ్ అది. అసలు ఆ స్విచువేషన్ లో హీరో అక్కడికి ఎందుకు వస్తాడు. అనేది రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. పెట్టాలని పెట్టింది కాదు కాని ఆ సందర్బంలో ఆ డైలాగ్ అవసరం.

పొలిటికల్ సెటైర్స్ ఉండవు

నిజానికి సినిమాలో పార్టీల పాలిటిక్స్ మీద ఎలాంటి సెటైర్స్ ఉండవు. ఇప్పటి రాజకీయాల గురించి సీన్స్ ఉండవు. నిజానికి ఉపేంద్ర లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో చెప్పిన కథ ఇది. ఏ ఇష్యూ కి కనెక్షన్ ఉండదు. ఎవరినీ ఉద్దేశించి ఉండదు. జస్ట్ ఓ క్యారెక్టర్ అతను ఉన్న నియోజిక వర్గం ఎలా ఉంది.. ఆ నియోజిక వర్గానికి ఏం చేశాడు..అంతే. పటాస్ లాంటి పక్కా కమర్షియల్ సినిమా. చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఫైనల్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.


కాజల్ పేరు అలా వచ్చింది

ఈ సినిమా అనుకోగానే ఆడియన్స్ అందరికీ తెలిసిన హీరోయిన్ అయితే బెటర్ అని ఫీలయ్యాం. ప్రొడక్షన్ నుండి కాజల్ పేరు వచ్చింది. మా నిర్మాతలు హీరోయిన్ నుండి అన్నిట్లోనూ చాలా జాగ్రత్త తీసుకున్నారు. కాజల్ క్యారెక్టర్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ వల్లే కథ మలుపు తిరుగుతుంది.

ఆ సినిమా నుండి రియలైజ్ అయ్యాను

నిజానికి తెలిసిన హీరో చేసే ప్రతీ సినిమా మీద కొన్ని అంచనాలుంటాయి. కాని నా సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది. తప్పకుండా చూడండి అని నేనుప్పుడూ ఫాన్స్ కి చెప్పలేదు. ప్రతీ సినిమా నుండి ఎంతో కొంత నేర్చుకున్నా. ముఖ్యంగా ‘ఓం’ సినిమా నుండి హీరోగా రియలైజ్ అయ్యాను. అసలు ప్రేక్షకులు సినిమాకి ఎందుకు వస్తారు. వారి భాదల నుండి కాస్త బయట పడ్డానికి ఆ రెండు గంటలు సరదాగా ఎంజాయ్ చేయడానికి వస్తారు. ‘ఇజం’ తర్వాత కొద్దిగా ఎంటర్ టైన్ మెంట్ ఉండేలా చూసుకుంటున్నాను.

 

మణిశర్మ గారితో నాలుగో సినిమా

మణిశర్మ గారితో ఇది నాలుగో సినిమా. ‘అతనొక్కడే’, ‘అభిమన్యు’ ‘కత్తి’ తర్వాత ఆయనతో మళ్ళీ వర్క్ చేసే అవకాశం లభించింది. నిజానికి ఆయన గురించి మాట్లాడే అనుభవం నాకు లేదు. సినిమాలో ‘యుద్ధం యుద్ధం’ అనే థీమ్ సాంగ్ ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలిచే సాంగ్ అది. అలంటి సాంగ్ కి మణి గారైతేనే బాగుంటుందనుకున్నాం. బాగ్రౌండ్ స్కోర్ లో ఆయన సిద్దహస్తుడు కాబట్టి ఆయనే పర్ఫెక్ట్ అనుకున్నాం.

 

ఆ తేడా కనిపించలేదు

నిజానికి ఈ సినిమా చేస్తున్నప్పుడు కానీ ఫినిష్ అయ్యాక కాని ఇది నా ప్రొడక్షన్ సినిమా కాదే అనిపించలేదు. నా సొంత ప్రొడక్షన్ సినిమాకి ఎలా ఖర్చు పెడతానో అలాగే ఖర్చు పెట్టారు. ఆ తేడా కనిపించలేదు. కథను నమ్మి నిర్మించారు.


నెక్స్ట్ చేయబోయే సినిమాలు

‘నా నువ్వే’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి డబ్బింగ్ చెప్తున్నా. నెక్స్ట్ విరించి, గుహన్ తో పాటు నా బ్యానర్ లో పవన్ సాదినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నా.

త్వరలో అనౌన్స్ చేస్తా

పవన్ సాదినేని డైరెక్షన్ లో నేను చేయబోయే సినిమాలో తారక్ అలాగే హరికృష్ణ గారు నటిస్తున్నారనే వార్తల పై త్వరలోనే క్లారిటీ ఇస్తాను. ఆ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు త్వరలోనే నా ప్రొడక్షన్ నుండి అనౌన్స్ చేస్తాను. ఆ సినిమా ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది.