#Bimbisara - కళ్యాణ్ రామ్ మరో ప్రయోగం!

Friday,May 28,2021 - 01:41 by Z_CLU

ఇటు హీరోగా అటు నిర్మాతగా పలు ప్రయోగాత్మక సినిమాలు చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు ‘బింబిసార’ అనే మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. వసిష్ట్ దర్శకత్వం వహిస్తున్న కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ సినిమాకు సంబంధించి తాజాగా నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. యుద్ధంలో శత్రువులను చంపి వారి శవాలపై ఠీవిగా కూర్చున్న బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ లుక్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు రేకెత్తిస్తుంది.

Kalyan-Ram-Bimbisara-movie-first-look-zeecinemalu-11

కెరీర్ లో మొదటి సారి మైథిలాజికల్ కథతో సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇది హీరోగా అతనికి 18వ సినిమా. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ , లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ని వాయిదా వేశారు. త్వరలోనే మిగిలిన భాగాన్ని చిత్రీకరించే ప్లానింగ్ లో ఉన్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. భారీ సెట్స్ తో , గ్రాండియర్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా అందరికీ సరికొత్త అనుభూతి కలిగిస్తుందని యూనిట్ చెప్తున్నారు.

కళ్యాణ్ రామ్ సరసన క్యాథరీన్ త్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. దర్శకుడు అనిల్ పాడూరి ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics