కళ్యాణ్ రామ్ ‘118’ టీజర్ రివ్యూ

Tuesday,December 18,2018 - 12:32 by Z_CLU

కళ్యాణ్ రామ్ ‘118’ టీజర్ రిలీజయింది. దర్శకుడు గుహన్ ఈ సినిమా టైటిల్ ని ఎంత డిఫెరెంట్ గా ప్లాన్ చేసుకున్నాడో, టీజర్ ని కూడా అంతే ప్లాన్డ్ గా కట్ చేసుకున్నాడు. 0:49 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ ని ఎన్నిసార్లు చూసినా, క్యూరియాసిటీ జెనెరేట్ అవుతుంది కానీ, స్టోరీలైన్ పై ఏ మాత్రం క్లూ దొరకట్లేదు.

మోస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతుందీ సినిమా. అల్టిమేట్ గా ఒకరోజు జరిగిన ఇన్సిడెంట్ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది. అసలా ఇన్సిడెంట్ ఏంటి..?, దానికి ‘118’ నంబర్ కి సంబంధం ఏంటి..?, ఇంతకీ కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది..? లాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది ఈ టీజర్.

ఈ సినిమాలో షాలినీ పాండే తో పాటు, నివేత థామస్ కూడా హీరోయిన్ గా నటించింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మహేష్ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. జనవరి 2019 లో సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.