కళ్యాణ్ రామ్ ‘118’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Friday,January 11,2019 - 05:08 by Z_CLU

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ‘118’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. సమ్మర్ కానుకగా ఈ సినిమాని మార్చి 1 న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి త్వరలో ప్రమోషన్స్ బిగిన్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

రీసెంట్ గా రిలీజైన టీజర్ ఆడియెన్స్ లో సినిమాపై కావాల్సినంత క్యూరియాసిటీని జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీమ్, త్వరలో ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ సినిమాలో షాలినీ పాండే తో పాటు, నివేత థామస్ కూడా హీరోయిన్ గా నటించింది. శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మహేష్ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. K.V. గుహన్ ఈ సినిమాకి డైరెక్టర్.