Bangarraju - సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Monday,January 10,2022 - 07:34 by Z_CLU

Kalyan Krishna reacts on Bangarraju Sequel

టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. F2 కి సీక్వెల్ గా F3 తెరకెక్కుతుంది. అలాగే ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ తీశారు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ సినిమాకు కూడా మరో సీక్వెల్ రానుందనే టాక్ వినబడుతుంది. ఈసారి అఖిల్ తో ఆ సీక్వెల్ చేస్తారనే న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై తాజాగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్పందించాడు.

‘బంగార్రాజు’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కళ్యాణ్ కృష్ణ కి అఖిల్ తో ఈ సినిమాకు సీక్వెల్ చేస్తారా ? అనే ప్రశ్న ఎదురైంది. దానికి కళ్యాణ్ కృష్ణ స్పందిస్తూ ” సీక్వెల్ చేయడం దానికి కథ -కథనం రాయడం చాలా కష్టమైన పని. బంగార్రాజు కి కొనసాగింపుగా సినిమా చేయాలంటే మరీ కష్టం. నాకు ఏదైనా మంచి ఆలోచన రావాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అఖిల్ కి వినిపించాలి. వాళ్లకి నచ్చాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన అయితే లేదు. ప్రెజెంట్ సంక్రాంతి బరిలో ఉన్న మా బంగార్రాజు గురించే ఆలోచిస్తున్నాను.” అంటూ క్లారిటీ ఇచ్చాడు.

ఇక సినిమాపై టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, నాగ్-నాగచైతన్య స్క్రీన్ ప్రెజెంట్స్ అదిరిపోతాయని ఇన్సైడ్ టాక్. నాగ్ కూడా ఇటివలే మ్యూజికల్ నైట్ లో సినిమా సక్సెస్ తర్వాత అందరి గురించి మాట్లాడతానంటూ వెరీ కాన్ఫిడెంట్ గా చెప్పారు. జనవరి 14న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం ఖాయమనిపిస్తుంది.