రవితేజ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ

Tuesday,February 27,2018 - 03:46 by Z_CLU

ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నేల టికెట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. అయితే గత వారం రోజులుగా రవితేజ ఆరోగ్య పరిస్థితి బాలేదనే రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇదే విషయాన్ని ట్విట్టర్ లో అడిగిన ఫ్యాన్ కి, అలాంటిదేం లేదని రవితేజ ఎప్పటి లాగే ఎనర్జిటిక్ గా ఆరోగ్యంగా ఉన్నాడని రిప్లై  ఇచ్చాడు కళ్యాణ్ కృష్ణ.

‘టచ్ చేసి చూడు’ లాంటి యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తరవాత తెరకెక్కుతున్న రవితేజ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. కళ్యాణ్ కృష్ణ మార్క్ కలర్ ఫుల్ ఫ్యామిలీ ఇమోషన్స్ తో పాటు రవితేజ మాస్ ఇమేజ్ కి తగ్గట్టు పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది. SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.