మెగాస్టార్ అల్లుడు కనుగంటి కళ్యాణ్ డెబ్యూ కి రెడీ

Friday,December 08,2017 - 03:45 by Z_CLU

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు, శ్రీజ భర్త కనుగంటి కళ్యాణ్ త్వరలో హీరోగా ఇంట్రడ్యూస్ కానున్నాడు. కొన్ని రోజులుగా గ్రాండ్ ఎంట్రీకి ప్రిపరేషన్స్ చేస్తున్న కళ్యాణ్, ఎట్టకేలకు ‘జతకలిసే’ సినిమాకి దర్శకత్వం వహించిన రాకేశ్ శశి తో జనవరి నుండి సెట్స్ పైకి రానున్నాడు.

 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న సినిమాకి సంబంధించి డీటేల్స్ ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. సాయి కొర్రపాటి ఈ సినిమాకి నిర్మాత.