మెగా అల్లుడు స్టార్ట్ చేశాడు

Tuesday,June 23,2020 - 11:56 by Z_CLU

కరోనా ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయిన సినిమా షూటింగ్స్ ఒక్కొక్కటిగా మొదలవుత్నున్నాయి. ఇప్పటికే 2-3 చిన్న సినిమాలు మళ్ళీ సెట్స్ పైకి వచ్చాయి. ఇక మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా తన ‘సూపర్ మచ్చి’ సినిమాకు సంబంధించి షూట్ స్టార్ట్ చేశాడు.

రామానాయుడులో అన్ని జాగ్రత్తలతో షూటింగ్ ప్రారంభించారు. నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ముందుగా హీరో కళ్యాణ్ దేవ్ -హీరోయిన్ రచిత రామ్ లపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.

సినిమాకు పనిచేసే టెక్నీషియన్స్ లో కొందరికి PPE కిట్స్ అందించి మరికొందరికి మాస్కులు, శానిటైజర్ అందించి అన్ని జాగ్రత్తల నడుమ షూట్ కొనసాగిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పులి వాసు దర్శకుడు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.