Kalavathi ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్

Tuesday,April 26,2022 - 06:33 by Z_CLU

 సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’  నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కళావతి పాట మెలోడీ అఫ్ ది ఇయర్ గా నిలిచింది. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ తాజాగా టాలీవుడ్ ఫాస్టెస్ట్ 150 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.9 మిలియన్స్ కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది.

కళావతి పాట ఇంటర్నెట్ సెన్సేషన్ గా నిలవడమే కాకుండా వివిధ ఆడియో స్ట్రీమింగ్ వేదికలు, యాప్స్ లో టాప్ సాంగ్ లిస్టు లో కొనసాగుతుంది. యుట్యూబ్ లో కూడా ట్రెండింగ్ వీడియోస్ లో చాలా రోజుల పాటు అగ్రస్థానంలో కొనసాగింది. ఈ పాటలో మహేష్ బాబు క్లాసీ డ్యాన్సులు ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. అనంత శ్రీరామ్ కళావతి పాటకు ఆకట్టుకునే సాహిత్యం అందించగా సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.

బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట  నిర్మిస్తున్నారు.

‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.