Kalaavathi Song - మోతమోగిస్తున్న మహేష్ పాట

Monday,February 28,2022 - 12:18 by Z_CLU

Kalaavathi From Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Hits 50 Million Views

సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ చిత్రం సర్కారు వారి పాటకు చెందిన ప్రమోషన్ పీక్ స్టేజ్ లో నడుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన కళావతి లిరికల్ వీడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. రికార్డు సంఖ్యలో లైక్‌లతో 24 గంటల్లో అత్యధిక వీక్షణల రికార్డును బ్రేక్ చేసింది.

తాజాగా కళావతి పాట మరో ఘనత సాధించింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో 50 మిలియన్ మార్క్‌ను చేరుకుంది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 50 మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి సింగిల్ ఇది.

అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయిన ఈ పాట అన్ని మ్యూజిక్ అప్లికేషన్‌లలో మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది. తమన్ సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ పాట పాడగా, అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాశారు. సంగీత ప్రియులు ఈ పాటపై తమ అభిమానాన్ని చాటుతున్నారు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యథిక ధరకు సరిగమ సంస్థ ఈ సినిమా సంగీత హక్కులను సొంతం చేసుకుంది.

ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సర్కారువారి పాట చిత్రాన్ని మే 12, 2022న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics