మోసగాళ్లు.. కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Friday,February 21,2020 - 02:55 by Z_CLU

శివరాత్రి సందర్భంగా మోసగాళ్లు సినిమా నుంచి కాజల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు మేకర్స్.

ఓ యదార్థ ఘటన ఆధారంగా మోసగాళ్లు సినిమా తెరకెక్కుతోంది. ఇండియాలో జరిగిన భారీ ఐటీ స్కామ్ అమెరికాను ఎలా కుదిపేసిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తోంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే లాస్ ఎంజెల్స్ లో భారీ షెడ్యూల్ పూర్తయింది. సోమవారం నుంచి మరో షెడ్యూల్ మొదలవుతుంది.

జెఫ్రీ జీ చిన్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు భార్య వెరానికా మంచు నిర్మిస్తున్నారు. సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది మోసగాళ్లు.