వెరైటీగా పలకరించిన కాజల్

Monday,September 12,2016 - 02:30 by Z_CLU

 

సోషల్ మీడియాలోకి ఎంటరైనప్పటి నుంచి రెగ్యులర్ గా తన అభిమానులతో టచ్ లో ఉంటోంది కాజల్. లేటెస్ట్ సినిమా అప్ డేట్స్ తో పాటు ఆన్-లొకేషన్ పిక్స్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తోంది. జనతా గ్యారేజ్ ఐటెంసాంగ్ షూటింగ్ సమయంలో చాలా పిక్స్ కాజల్ ఇచ్చినవే. ప్రస్తుతం ఈ బ్యూటీ… చిరంజీవి సరనస ఖైదీ నంబర్-150 సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ సెట్స్ పై కూడా తనదైన స్టయిల్ లో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. వీకెండ్ గ్యాప్ తీసుకున్న సినిమా యూనిట్… ఈ రోజు నుంచి మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా సెట్స్ పైకి వచ్చిన కాజల్… హ్యాపీ మండే అంటూ వెరైటీగా అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పింది.