వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ ?

Tuesday,August 17,2021 - 06:39 by Z_CLU

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తుంది. అందుకే స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకూ సిరీస్ లపై ఫోకస్ పెడుతూ మంచి స్క్రిప్ట్స్ అనిపిస్తే ఓకె చెప్పేస్తున్నారు. ఇక హీరోయిన్స్ అంతే. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ సిరీస్లు చేస్తూ మంచి రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు నిషా అగర్వాల్ కూడా ఆ ప్లానింగ్ లో ఉందట. కాజల్ చెల్లెలుగా టాలీవుడ్ కి పరిచయమై కొన్ని సినిమాలు చేసిన నిషా పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ తో హ్యాపీ గా ఉన్న ఈ అమ్మడు త్వరలోనే వెబ్ సిరీస్ లో కనిపించనుందని సమాచారం. విక్టరీ వెంకటేష్ , రానా కలిసి ఒక OTT సంస్థ కోసం వెబ్ సిరీస్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆ సిరీస్ కోసమే నిషా ని సంప్రదించారని తెలుస్తుంది. క్యారెక్టర్ నచ్చడంతో వెంటనే నిషా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మరి 2013 లో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఈ సిరీస్ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సినిమాలు కూడా చేయలనుకుంటుందట.

అయితే నిషా అగర్వాల్ క్యారెక్టర్ కొన్ని ఎపిసోడ్స్ కే పరిమితమా ? లేదా అన్ని సిరీస్ లో కనిపిస్తుందా ? అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సిరీస్ ను డీటెయిల్స్ తో ఎనౌన్స్ చేయబోతున్నారని సమాచారం. వెంకటేష్ ఇందులో ఒక రెండు మూడు ఎపిసోడ్స్ లో మాత్రమే కనిపిస్తాడని కానీ కథలో కీలకమైన క్యారెక్టర్ అని ఇన్సైడ్ టాక్. సో త్వరలోనే మిగతా డీటెయిల్స్ కూడా బయటికి రానున్నాయి.