చెప్పుకోండి చూద్దాం: కాజల్ ఎక్కడ?

Saturday,February 09,2019 - 01:59 by Z_CLU

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ గ్రూప్ ఫొటో వైరల్ అవుతోంది. అదొక బ్లాక్&వైట్ ఫొటో. చూసిన వెంటనే అందులో ఉన్న సెలబ్ ఎవరో కూడా చెప్పలేం. కానీ ఆ పిక్ వైరల్ అవ్వడానికి కారణం కాజల్.

అవును.. తను చిన్నప్పుడు దిగిన గ్రూప్ ఫొటోను నెటిజన్స్ తో షేర్ చేసుకుంది బుట్టబొమ్మ కాజల్. చిన్నప్పటి రోజులు మళ్లీ రావంటూ గుర్తుచేసుకుంటూనే, ఆ ఫొటోలో తను ఎక్కడున్నానో చెప్పుకోండి చూద్దాం అంటూ ఓ చిన్న పజిల్ కూడా వదిలింది.

ఫొటో చూస్తే అందరూ అమ్మాయిలే ఉన్నారు. కానీ కాజల్ ను గుర్తుపట్టడం వెరీ ఈజీ. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి.