కాజల్ ఐటం సునామీ

Thursday,January 19,2017 - 01:30 by Z_CLU

జనతా గ్యారేజ్ లో నేను పక్కా లోకల్ అంటూ పరేషాన్ చేసిన కాజల్, ఇప్పుడు ఐటం సాంగ్స్ కి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి టాలీవుడ్ స్ట్రీట్స్ లో మరింత హీట్ ని పెంచేసింది. స్టార్ హీరోలైతేనే ఐటం సాంగ్ అని క్లారిటీ ఇచ్చిన కాజల్ ఫ్యాన్స్ అకౌంట్ లో పెద్ద పజిల్ నే క్రియేట్ చేసింది.

కాజల్ ఐటం నంబర్ కి సంతకం చేయబోయే నెక్స్ట్ స్టార్ హీరో ఎవరు…? ఇది ఫ్యాన్స్ అదే పనిగా డిస్కస్ చేస్తున్న హాట్ టాపిక్. నిజానికి ఈ లిస్టు లో రామ్ చరణ్, సుక్కు సినిమా అయ్యే చాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అలా నుకుని ఫిక్స్ అయ్యేలోపే… ఆల్ రెడీ సెట్స్ పై ఉన్న బన్ని DJ కూడా లిస్టులో బ్లింక్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఏదోటి తేల్చుకుంటే సరి అనుకునే లోపు, రేపో మాపో సెట్స్ పైకి రానున్న NTR సినిమా కూడా హైలెట్ అవుతుంది.

ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అంత ఈజీగా తేలేవిషయం కాకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఈ డిస్కషన్ ని అంత ఈజీగా అటకెక్కించే ఆలోచనలో లేరు. కాజల్ తన స్టేట్ మెంట్ తో సృష్టించిన ఈ క్రేజీ ఐటం సునామీ ఇప్పట్లో తగ్గే సూచనలైతే కనిపించడం లేదు.