లాక్ డౌన్ లో కాజల్ ఏం చేస్తోంది?

Tuesday,April 28,2020 - 12:46 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో అందరు హీరోయిన్లలానే కాజల్ కూడా ఇంట్లోనే ఛిల్ అవుతోంది. కాకపోతే టైమ్ వేస్ట్ చేయకుండా, తనకుతాను బిజీగా ఉంటోంది. ఎప్పట్నుంచే నేర్చుకోవాలనుకుంటున్న విషయాలు నేర్చుకుంటోంది. ఎంజాయ్ చేస్తూనే, బోర్ కొట్టకుండా జాగ్రత్త పడుతోంది.

“షూటింగ్ టైమ్ లో ఎలా ఉంటానో లాక్ డౌన్ టైమ్ లో కూడా అంతే బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. మార్నింగ్ లేచి యోగా, ఎక్సర్ సైజ్ చేస్తున్నాను. ఆన్ లైన్ లో కొన్ని న్యూరో ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ లాంటి క్లాసులు నేర్చుకుంటున్నాను. ఛెస్ నేర్చుకుంటున్నాను. భగవద్గీత చదువుతున్నాను. భాగవతం వింటున్నాను. కొత్త వంటలు ట్రై చేస్తున్నాను. ఇలా రోజంతా బిజీగా ఉంటున్నాను.”

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది కాజల్. తెలుగులో మోసగాళ్లు, ఆచార్య సినిమాలు చేస్తోంది. తమిళ్ లో కమల్ తో ఇండియన్-2 చేస్తోంది. అటు హిందీలో ముంబయి సాగా అనే సినిమా చేస్తోంది. ఇలా బిజీబిజీగా గడుపుతున్న టైమ్ లో లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. దీంతో ఎన్నాళ్ల నుంచో చేయాలనుకుంటున్న పనుల్ని ఇప్పుడు పూర్తిచేస్తోంది కాజల్.