రాజుగారి గది-2లో స్టార్ హీరోయిన్?

Saturday,July 08,2017 - 12:50 by Z_CLU

నాగార్జున సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో కాజల్ కూడా నటిస్తుందట. ఇప్పటికే ఆమెపై 10 రోజుల షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారట. సినిమాలో ఆమె దెయ్యం పాత్రలో కనిపించబోతోందట. ప్రస్తుతం ఈ సంచలన వార్త టాలీవుడ్ లో హాట్ హాట్ గా మారింది.

రాజుగారి గది-2లో నాగార్జున మెంటలిస్ట్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కీలక పాత్రలో సమంత కూడా నటిస్తోంది. ఇప్పుడు మరో కీలకమైన పాత్ర కోసం కాజల్ ను తీసుకున్నారట. ఓంకార్ ఈ సినిమాకు దర్శకుడు.

రాజుగారి గది-2 సినిమాలో కాజల్ ఉందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఓ మంచి టైమ్ చూసి మేకర్స్ కొన్ని ఆశ్చర్యకర విషయాల్ని బయటపెడతారట. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్టిల్స్ రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.