మహేష్ సరసన మరోసారి?

Saturday,March 10,2018 - 11:14 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్యూటిఫుల్ కాజల్ మరోసారి కలిసి నటించబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు నెక్ట్స్ మూవీలో కాజల్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం డిస్కషన్స్ నడుస్తున్నాయి.

భరత్ అనే నేను సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఇప్పటికే ఎంపిక చేశారు. మరో హీరోయిన్ గా కాజల్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

మహేష్ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించడానికి కాజల్ ఒప్పుకుంటుందా అనే సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే గతంలో మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ అయితే, కాజల్ సెకెండ్ హీరోయిన్.

బ్రహ్మోత్సవం కంటే ముందు మహేష్-కాజల్ కాంబోలో బిజినెస్ మేన్ సినిమా వచ్చింది. వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి పేరొచ్చింది. చూస్తుంటే.. కాజల్ మరోసారి మహేష్ సరసన మెరుస్తుందేమో అనిపిస్తుంది.