బెల్లంకొండ సరసన కాజల్?

Monday,February 26,2018 - 11:20 by Z_CLU

తన సినిమాల్లో ఎప్పుడూ స్టార్ హీరోయిన్లను తీసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఇందులో భాగంగా ఇప్పటికే సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలతో సినిమాలు చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు కాజల్ పై ఫోకస్ పెట్టాడు. వీలైతే తన నెక్ట్స్ మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శ్రీనివాస్ ను పరిచయం చేస్తూ ఓ సినిమాకు ఈమధ్యే కొబ్బరికాయ కొట్టాడు బెల్లంకొండ. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా.. మెయిన్ హీరోయిన్ గా కాజల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు. కాజల్ ఫిక్స్ అయిన వెంటనే సెకెండ్ హీరోయిన్ ను ప్రకటిస్తారు. నవీన్ నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.