'జనతా గ్యారేజ్' సెట్స్ లో కాజల్

Wednesday,August 17,2016 - 03:50 by Z_CLU

ఎన్టీఆర్-కాజల్ మరోసారి కలిశారు. టెంపర్, బృందావనం లాంటి సినిమాల్లో తారక్ సరసన మెరిసిన కాజల్.. ఈసారి కూడా యంగ్ టైగర్ తో కలిసి సినిమా చేస్తోంది. అయితే ఆమె హీరోయిన్ గా చేయడం లేదు. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ‘నేను పక్కా లోకల్’ అంటూ  ఐటెంసాంగ్ కు స్టెప్పులేస్తోంది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ ఈరోజు నుంచి ఏకథాటిగా 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పాటతో ప్యాచ్ వర్క్ మినహా జనతా గ్యారేజ్ కు సంబంధించిన షూ టింగ్ దాదాపు కంప్లీట్ అయిపోతుంది. దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సినిమా పాటలకు ఇప్పటికే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించారు. సినిమాలో కాజల్ ఐటెంసాంగ్ చేస్తుండగా… సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మోహన్ లాల్, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.