Kajal Thriller Movie - మరో కొత్త ప్రయోగం

Friday,May 28,2021 - 06:45 by Z_CLU

ఈసారి కొత్త లుక్ లో, కొత్త క్యారెక్టర్ తో కూడా ఎంటర్ టైన్ చేయబోతోంది స్టార్ హీరోయిన్ కాజల్. త్వరలోనే ఆమె ఓ థ్రిల్లర్ మూవీలో కనిపించబోతోంది. దీనికి సంబందించి సెటప్ మొత్తం రెడీ అయింది. అఫీషియల్ స్టేట్ మెంట్ ఒక్కటే పెండింగ్.

రీసెంట్ గా ఓ థ్రిల్లర్ స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు జయశంకర్. ఆ స్టోరీలైన్ ను కాజల్ కు వినిపించాడు. స్టోరీ విన్న వెంటనే కాజల్ నటించడానికి అంగీకరించింది. అయితే ఆ వెంటనే లాక్ డౌన్ పడ్డంతో అధికారిక ప్రకటన ఆలస్యమౌతూ వస్తోంది.

Kajal new stills zeecinemalu 1

గతంలో సంతోష్ శోభన్ హీరోగా పేపర్ బాయ్ అనే సినిమా తీశాడు జయశంకర్. సెన్సిబుల్ ఎలిమెంట్స్ తో, రొమాంటిక్ ఫీల్ తో వచ్చిన ఆ సినిమా సంతోష్ శోభన్ కే కాదు, జయశంకర్ కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత విటమిన్-షీ అనే మరో టెక్నాలజీ బేస్డ్ సినిమాతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ డైరక్టర్. ఇప్పుడు ఏకంగా కాజల్ మెయిన్ లీడ్ గా థ్రిల్లర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

టాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics