ఇప్పట్లో నెరవేరుతుందా...?

Thursday,October 13,2016 - 12:55 by Z_CLU

 కాజల్ అంటే మనకు గొప్ప. ఎన్నో హిట్ సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన మెరిసింది. అటు తమిళ తంబీలకు కూడా కాజల్ అంటే క్రేజ్. అక్కడ కూడా స్టార్స్ తో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. అయితే బాలీవుడ్ జనాలకు మాత్రం ఈ అమ్మడంటే అస్సలు పడడం లేదు. ఎన్నిసార్లు క్రేజ్ తెచ్చుకుందామని చూసినా… ప్రతిసారి కాజల్ ప్రయత్నాల్ని బాలీవుడ్ హీరోలు తిప్పికొడుతూనే ఉన్నారు. ఆమెకు సరైన ఎంకరేజ్ మెంట్ అందించడం లేదు. దీనికి తోడు ఇప్పుడు మరో కోరికను కూడా బయటపెట్టింది ఈ చందమామ.

maxresdefault

సింగం, స్పెషల్ ఛబ్బీస్ సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ నుంచి సరైన అవకాశాలు రావడం లేదు. బడా హీరోల సంగతి అలా ఉంచితే, ఓ మోస్తరు క్రేజ్ ఉన్న షాహిద్ కపూర్ లాంటి హీరోలు కూడా కన్సిడర్ చేయడం లేదు. ఇలాంటి టైమ్ లో ఏకంగా తనకు సల్మాన్ ఖాన్ తో నటించాలని ఉందంటూ కాజల్… తన మనసులో మాట బయటపెట్టింది. బాలీవుడ్ లో అంతంతమాత్రంగానే అవకాశాలు దక్కించుకుంటున్న ఈ బ్యూటీకి సల్మాన్ ఖాన్ ఛాన్స్ ఇస్తాడంటారా.