తేజ సినిమా టైటిల్ కన్ఫమ్ చేసిన కాజల్

Friday,January 04,2019 - 06:00 by Z_CLU

తేజ డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్  సినిమాలో  నటిస్తుంది కాజల్. అయితే ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఎక్కడా టైటిల్ రివీల్ చేయలేదు మేకర్స్. కానీ రీసెంట్ గా ఒక ఈవెంట్ కి అటెండ్ అయిన కాజల్, ఈ సినిమా టైటిల్ ‘సీత’ అని కన్ఫమ్ చేసింది.

ఈ సినిమాలో కాజల్ చాలా డిఫెరెంట్ రోల్ లో కనిపించనుంది. ఇప్పటివరకు లవబుల్ క్యారెక్టర్స్ తో మెస్మరైజ్ చేసిన కాజల్, ఈ సినిమాలో డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిలా కనిపించనుంది. ఈ క్యారెక్టర్ కి ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ ని ఎటాచ్ చేసుకున్న తేజ, బెల్లంకొండ శ్రీనివాస్ ని కాజల్ రక్షకుడిగా, మాసివ్ మ్యాన్ గా ప్రెజెంట్ చేస్తున్నాడు.

ఈ సినిమాని మ్యాగ్జిమం మార్చిలో రిలీజ్ చేయాలనే ప్రాసెస్ లో ఉన్నారు మేకర్స్. అనిల్ సుంకర ఈ సినిమాని AK ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.