డాన్సింగ్ క్వీన్ గా కాజల్?

Thursday,March 12,2020 - 12:09 by Z_CLU

మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది కాజల్. కొరియన్ లాంగ్వేజ్ లో వచ్చిన డాన్సింగ్ క్వీన్ అనే సినిమా రీమేక్ లో ఈ ముద్దుగుమ్మ నటించబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆల్రెడీ ఓ కొరియన్ రీమేక్ వచ్చింది. మిస్ గ్రానీ అనే సినిమాను సమంత లీడ్ రోల్ రీమేక్ చేశారు సురేష్ బాబు. ఇప్పుడు అదే లాంగ్వేజ్ నుంచి డాన్సింగ్ క్వీన్ అనే సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని, కాజల్ లీడ్ రోల్ లో రీమేక్ చేయబోతున్నారు.

ఈ ప్రాజెక్టులో మరో హైలెట్ ఏంటంటే.. ఇందులో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నాడు. మూవీకి సంబంధించి త్వరలోనే అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.

తెలుగులో మంచు విష్ణు సరసన మోసగాళ్లు అనే సినిమా చేస్తోంది కాజల్. తమిళ్ లో కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు-2 చేస్తోంది. అటు హిందీలో జాన్ అబ్రహాంతో ముంబయి సాగా అనే సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ చందమామ, డాన్సింగ్ క్వీన్ గా మారబోతోందన్నమాట.