Kajal Marriage - పెళ్లి డేట్ కూడా ఫిక్స్

Tuesday,October 06,2020 - 12:07 by Z_CLU

ఎవరైనా ముందు పెళ్లి మేటర్ చెబుతారు. కాబోయే భర్త వివరాలు బయటపెడతారు. కానీ కాజల్ (Kajal) మాత్రం అన్నీ ఒకేసారి మోసుకొచ్చింది. అవును.. కాజల్ స్వయంగా తన పెళ్లి డీటెయిల్స్ బయటపెట్టింది.

అక్టోబర్ 30న ముంబయిలో కాజల్ పెళ్లి జరగబోతోంది. Kajal కాబోయే భర్త పేరు గౌతమ్ కిచ్లు (Gautam Kitchlu). ముంబయిలోని ఓ రెస్టారెంట్ లో ఈ పెళ్లి జరుగుతుంది.

కరోనా/లాక్ డౌన్ కారణంగా ఈ పెళ్లికి ఎవ్వర్నీ పిలవడం లేదు కాజల్. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా ఈ పెళ్లి జరగబోతోంది.

మరోవైపు తన కెరీర్ పై కూడా క్లారిటీ ఇచ్చింది కాజల్. పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది.

Kajal Marriage ఎనౌన్స్ మెంట్ వచ్చిన వెంటనే ఆమెకు టాలీవుడ్ నుంచి వరుసగా విసెష్ అందిస్తున్నారు. రాశిఖన్నా, హన్సిక, మెహ్రీన్, ప్రగ్యా జైశ్వాల్.. ఇలా చాలామంది హీరోయిన్లు కాజల్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.