Kajal Marriage - పార్టీ షురూ చేసిన బ్యూటీ

Wednesday,October 07,2020 - 01:48 by Z_CLU

నిన్న పొద్దున్నే పెళ్లి మేటర్ బయటపెట్టిన కాజల్, సాయంత్రానికి పార్టీలు షురూ చేసింది. రాత్రి తన క్లోజ్ ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ పార్టీకి చెందిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కరోనా వల్ల పెళ్లికి ఎవ్వర్నీ పిలవడం లేదని ఆల్రెడీ ప్రకటించింది Kajal. అందుకే ఇలా విడతల వారీగా తన క్లోజ్ సర్కిల్ కు పార్టీలు ఇస్తోంది. రాత్రి పూర్తిగా తన ఫ్రెండ్స్ కు మాత్రమే పార్టీ ఇచ్చిన కాజల్.. రేపోమాపో తన టాలీవుడ్ క్లోజ్ సర్కిల్ కు కూడా పార్టీ ఇవ్వబోతోందని టాక్.

ఓ వైపు పార్టీలు ఇస్తూనే, మరోవైపు పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా మొదలుపెట్టింది కాజల్. ఈనెల 30 ముంబయిలో గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతోంది ఈ బ్యూటీ.