కాజల్ ఇంటర్వ్యూ

Monday,May 20,2019 - 01:58 by Z_CLU

స్టార్ హీరోలు , యంగ్ హీరోలు అనే తేడా లేకుండా కథలకే ప్రాధాన్యం ఇస్తూ హీరోయిన్ గా దూసుకెళ్తుంది కాజల్. ప్రస్తుతం ‘సీత’ సినిమాతో నాలుగు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న కాజల్ మీడియాతో మాట్లాడింది. ‘సీత’ గురించి కాజల్ చెప్పిన విశేషాలు తన మాటల్లోనే…

 

ఇదే మొదటి సారి

సీత చాలా మోడరేట్. తన డ్రీమ్స్, తన గోల్స్ ను ఎలాగైనా సాధించుకోవాలనే పట్టుదలతో ఎంతో ఫోకస్డ్ గా ఉంటుంది. అయితే తన గోల్స్ ను, డ్రీమ్స్ ను సాధించుకునే క్రమంలో తానేం చేసిందనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది. ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యే విధంగా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఇదే మొదటిసారి కాబట్టి నేను కూడా ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను.

 

క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు

‘నేనే రాజు నేనే మంత్రి’ షూటింగ్ సమయంలోనే తేజ గారు నాకు ‘సీత’ కథ చెప్పారు. ఈ పాత్రను నాతోనే చేయాలని చెప్పి ప్రామిస్ తీసుకున్నాను. సీత జీవితంలో జరిగిన సంఘటనలు తెలియజేసే క్రమమే సినిమా కథాంశం. సీత ఈ తరం చాలా మంది అమ్మాయిలకు ప్రతిరూపం లాంటిది. తప్పకుండా నేటి తరం యువతులు ఈ క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు.


నా క్యారెక్టర్ చుట్టూనే…

సినిమా చూస్తే నా క్యారెక్టర్ ఎందుకు అలా ఉందనేది అర్ధమవుతుంది. సినిమా ‘సీత’ పాత్ర చుట్టే తిరుగుతుంది. మరి అలాంటప్పుడు ఆ పాత్ర ఏ స్థాయిలో ఉండాలి. కరెక్ట్ గా ఆ స్థాయిలోనే ‘సీత’ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ప్రకారమే సీత బిహేవ్ చేస్తోంది.

 

లీనం అయిపోతున్నారు

తేజ గారిలో చాలా మార్పులు గమనించాను. యూనిట్ నుంచి తనకు కావాల్సిన వర్క్ రాబట్టుకోవడం కోసం ఆయన కమాండ్ చేసే విధానం మారింది. అలాగే యాక్షన్, కట్ కి మధ్యలో ఆయన మెడిటేషన్ చేస్తున్నంతగా షాట్ లో లీనం అయిపోతున్నారు. ఇరవై నాలుగు గంటలు పని చెయ్యగలిగేంత హార్డ్ వర్కర్, ఎనర్జీ మెయింటైన్ చేయడంలో. ఆయనకు ఆయనే సాటి. తేజగారితో పని చెయ్యడం వల్ల చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ సినిమాతో కూడా చాలా నేర్చుకున్నాను.

 

తనకే ఛాలెంజింగ్

సాయి శ్రీనివాస్ తో ఇది సెకెండ్ ఫిల్మ్. తన పాత్రలో తాను అద్భుతంగా నటించాడు. ఎందుకంటే తన క్యారెక్టర్ కూడా రెగ్యులర్ గా ఉండదు. ముందుగా ఆ క్యారెక్టరైజేషన్ని అర్ధం చేసుకోవడం.. అందుకు తగ్గట్లు నటించడం చాలా కష్టం. నిజంగా శ్రీనివాస్ చాలా బాగా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నాకంటే తనకే ఈ సినిమా ఛాలెంజింగ్. తనతో మళ్లీ కలిసి పని చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది.

 

లేడీస్ కి సంబంధించి

సోషల్ మెసేజ్ అయితే సినిమాలో టచ్ చెయ్యలేదు. కాకపోతే ప్రతి వ్యక్తికి ఎవరికీ వారికీ పర్సనల్ డెవలప్ మెంట్ కి సంబంధించి మెసేజ్ ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ కి సంబంధించి మంచి మెసేజ్ ఉంటుంది.

 

డాక్టర్ ఉండేవాడు

కథ ప్రకారం చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించాను. షూటిం గ్ టైంలో  చాలా సార్లు గాయాలపాలయ్యాను. నాకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ సమయంలో సెట్లో  ఫిజియోథెరపీ కి సంబదించిన డాక్టర్ ఉండేవారు. కానీ సినిమా కోసం అవన్నీ పెద్ద కష్టం అనిపించలేదు.

 

మంచి ఎక్స్ పీరియన్స్

కాకపాతే మెగాస్టార్ గారితో కలిసి పని చేయడం అదొక గ్రేట్ ఫీలింగ్. అలాగే యంగ్ హీరోస్ తో కలిసి చెయ్యడం కూడా మంచి ఎక్స్ పీరియన్స్.


ప్లాన్స్ ఉన్నాయి.

ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిమ్స్ చేయాలనుంది. కచ్చితంగా చేస్తాను. ప్రశాంత్ వర్మతో నిర్మాతగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాను. ప్రస్తుతానికైతే యాక్టింగ్ మీదే ఫోకస్ పెట్టాను . ప్రొడ్యూసర్ గా మారడానికి ఇంకాస్త టైం పడుతుంది.

 

కమల్ సర్ బిజీ వల్లే

‘ఇండియన్ 2’ సినిమా ఆగిపోయిందనే వార్తలో నిజం లేదు. కమల్ సర్ బిజీగా ఉండటం వల్ల షూట్ మధ్యలో బ్రేక్ వచ్చింది. జూన్ నుండి మళ్ళీ షూట్ మొదలవుతుంది. ఆ సినిమా కోసం నేను కూడా చాలా ఇంట్రస్టింగ్ గానే వెయిట్ చేస్తున్నాను.

 

తెలుగులో పెద్ద ప్రాజెక్ట్ …

శర్వానంద్ తో ఓ మూవీ జరుగుతుంది. లేటెస్ట్ గా షూట్ కూడా ఆయిపోయింది. అలాగే తమిళ్ లో జయం రవితో చేస్తోన్న మూవీ షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇక ‘ఇండియన్ 2’ అలాగే తమిళంలో మరో సినిమా చేస్తున్నాను. తెలుగులో రెండు సినిమాలు ఉన్నాయి. త్వరలోనే నేను తెలుగులో చేయబోయే పెద్ద ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ మెంట్ వుంటుంది.

 

కాజల్ లేటెస్ట్ ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి