'సీత' రిలీజ్ డేట్ ఫిక్సయింది

Monday,April 22,2019 - 08:41 by Z_CLU

లెక్కప్రకారం ఏప్రిల్ 25 న రిలీజ్ కావాలి ‘సీత’ సినిమా. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయి ఉంది.  రీజన్స్ పెద్దగా బయటికి రాలేదు ఈ సినిమాని అఫీషియల్ గానే పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. ఆల్మోస్ట్ ఈ సినిమాని మే 24 న రిలీజ్ చేయాలని ఫిక్సయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

‘నేనే రాజు నేనే మంత్రి’ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తరవాత తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ‘కవచం’ తరవాత రెండోసారి జోడీ కట్టారు బెల్లం కొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్. సినిమాలో కాజల్ అగర్వాల్ రెగ్యులర్ హీరోయిన్స్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది.

తెలుగులో కాస్త బ్రేక్ తీసుకున్న సోను సూద్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.