శర్వా సినిమాపై కాజల్ అగర్వాల్ ఇంపాక్ట్

Monday,May 14,2018 - 12:09 by Z_CLU

కరియర్ లోనే ఫస్ట్ టైమ్ మాఫియా డాన్ లా నటిస్తున్నాడు శర్వానంద్. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అయితే ఈ సినిమాలో శర్వా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. డాన్ క్యారెక్టర్ కాకుండా శర్వా ప్లే చేస్తున్న ఇంకో క్యారెక్టర్ గురించి ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ, జూన్ 15 నుండి ఈ సినిమా నుండి సెట్స్ పైకి రానున్న కాజల్ అగర్వాల్ చుట్టూ ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

ఇప్పటికే కళ్యాణి ప్రియదర్శన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, మరో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని కన్ఫం చేశారు. అయితే ఇన్ సైడ్ సోర్సెస్ ని బట్టి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ప్లే చేస్తున్న క్యారెక్టర్, సినిమాపై హై ఇంపాక్ట్ చూపించే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. దాంతో జస్ట్ కాజల్ క్యారెక్టర్ విషయంలోనే కాదు, కంప్లీట్ సినిమాపైనే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది.

ప్రస్తుతం ‘క్వీన్’ రీమేక్ లో నటిస్తున్న కాజల్ అగర్వాల్ జూన్ 15 కల్లా ప్యారిస్ షెడ్యూల్ ని ఎలాగోలా కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. అక్కడ ఆ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పీ చెప్పగానే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తుంది కాజల్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.