ఈ ఏడాది ఆ స్థానం కాజల్ కే దక్కింది....

Friday,December 16,2016 - 04:00 by Z_CLU

టాలీవుడ్ టాప్ బ్యూటీ కాజల్ పేరు ప్రెజెంట్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. లేటెస్ట్ గా తన ఫాలోయింగ్ తో బాలీవుడ్ భామలకు సైతం షాక్ ఇచ్చి హల్ చల్ చేస్తోంది కాజల్. ఈ ఏడాది గూగుల్ సెర్చింగ్ లో ఇండియన్ హీరోయిన్ గా మూడో స్థానం అందుకుంది ఈ చందమామ.

      మొదటి రెండు స్థానాల్లో ఇండియన్ హీరోయిన్స్ గా కత్రినా కైఫ్, సన్నీలియోన్ లు కైవసం చేసుకోగా ఈ రేస్ లో బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనెలను సైతం వెనక్కి నెట్టేసి మూడో స్థానం దక్కించుకుంది కాజల్. ప్రెజెంట్ 2016 గూగుల్ సెర్చింగ్ లో కాజల్ 3వ స్థానం అందుకుందనే వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

kajal-agarwal

    కెరీర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకూ సెలెక్టివ్ క్యారెక్టర్స్ తో యూత్ ఫేవరెట్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ 150 ‘ సినిమా తో పాటు రానా తో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.