సెలబ్రిటీస్ కోసం మరోసారి సిద్ధమైన కబాలి

Tuesday,July 26,2016 - 04:56 by Z_CLU

 

మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కబాలి సినిమాకు వసూళ్లు అదిరిపోతున్నాయి. లోకల్ గానే కాకుండా… ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు కళ్లుచెదిరే కలెక్షన్లు వస్తున్నాయి. మరోవైపు నెల రోజులుగా అమెరికాకే ఫిక్స్ అయిపోయిన రజనీకాంత్… తిరిగి చెన్నై రావడంతో కబాలి హంగామా మరోసారి షురూ అయినట్టు అయింది. దీనికితోడు ఇప్పుడు రజనీకాంత్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించాడు. కొంతమంది సెలబ్రిటీస్ కోసం కబాలి సినిమాను చెన్నైలో ప్రత్యేకంగా ప్రదర్శించడానికి సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.

కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి ప్రముఖ నటులు కబాలి సినిమా ఇఁకా చూడలేదని ఇప్పటికే ప్రకటించారు. వీళ్లతో పాటు మరింతమంది సెలబ్రిటీస్ ను వ్యక్తిగతంగా కలిసే ఉద్దేశంతో… రజనీకాంత్ స్వయంగా ఈ ప్రీమియర్ ను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం… ఈ వీకెండ్ లో చెన్నైలో ప్రముఖుల కోసం కబాలి సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.