180 వెబ్ సైట్స్ లో 'కబాలి' చిత్రం

Wednesday,July 20,2016 - 08:10 by Z_CLU

 

ఈ మధ్య అన్ని భాషల్లో వస్తున్న సినిమాలను పెనుభూతంలా పట్టి పీడిస్తున్న పైరసీ… తాజాగా రజని ‘కబాలి’ ను కూడా కమ్మేసింది. భారీ అంచనాల మధ్య 22 న విడుదలకానున్న ఈ చిత్రం విడుదలకి మూడు రోజుల ముందే వెబ్ సైట్ లో ప్రత్యక్షమైంది. ఈ వార్త తెలుసుకొని ఒక్క సారి గా షాక్ అయింది చిత్ర యూనిట్. ఇక ఈ విషయం పై ఈ చిత్ర నిర్మాత కలైపులి ఎస్. థాను చెన్నై హై కోర్ట్ లో పిటీషన్ వేశారు . అయితే ‘కబాలి’ పైరసీ వీడియో దాదాపు 180 సైట్స్ లో పెట్టారని ఆ సైట్స్ లో నుండి వెంటనే ఈ వీడియోస్ ను తీసెయ్యాలని నిర్మాత కోర్ట్ కు విజ్ఞప్తి చెయ్యడం తో వెంటనే కోర్ట్ ఈ విషయం పై స్పందించి ఆ సైట్స్ కి లీగల్ నోటీసులు పంపి వెంటనే పైరసీ కు అడ్డుకట్ట వెయ్యడం జరిగింది. ఏదేమైనా ‘కబాలి’ విడుదలకి ముందే ఇలా ఆన్ లైన్ లో విడుదల కావడం పై సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నారు రజని ఫ్యాన్స్. ప్రస్తుతానికి 180 లింక్స్ ను బ్లాక్ చేసినప్పటికీ… ఏదో ఒక సైట్ లో ఈ సినిమా ప్రత్యక్షమౌతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం… కబాలి హెడ్ డీ ప్రింట్… ఎడిట్ రూమ్ నుంచే లీకైనట్టు తెలుస్తోంది.