అన్నను మించిన తమ్ముడు

Friday,October 07,2016 - 06:20 by Z_CLU

డిఫరెంట్ సినిమాలు చేయడంలో కార్తి తర్వాతే ఎవరైనా. కథ, క్యారెక్టరైజేషన్ బాగుంటే ఎలాంటి పాత్ర అయినా చేస్తాడు. అతడు నటించిన యుగానికొక్కడు, ఊపిరి లాంటి సినిమాలు చూస్తే కార్తి మూవీ సెలక్షన్ ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. ఈ విలక్షణ హీరో మరో ప్రయోగంతో మనముందుకొస్తున్నాడు. అదే కాష్మోరా.

    మగధీరకు, కాష్మోరాకు దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. గత జన్మ కాన్సెప్ట్ తోనే కాష్మోరా కూడా తెరకెక్కింది. సినిమాకు సంబంధించి మొట్టమొదట ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ కార్తి గెటప్. అలా గెటప్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా.. తాజాగా ట్రయిలర్ తో మరోసారి అందర్నీ ఆకర్షించింది. పీవీపీ బ్యానర్ పై తెరకెక్కిన కాష్మోరా సినిమా తెలుగు ట్రయిలర్ తాజాగా విడుదలైంది.