కాలా తెలుగు టీజర్ రిలీజ్

Friday,March 02,2018 - 10:56 by Z_CLU

రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కాలా. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. కాలా క్యారెక్టర్ లో, కంప్లీట్ మాస్ లుక్ తో రజనీకాంత్ తన నటవిశ్వరూపం చూపించారు. ముంబయి మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో మరోసారి పేదల కోసం పోరాడే మాఫియా డాన్ పాత్రలో కనిపించబోతున్నారు సూపర్ స్టార్.

పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు. గతంలో రజనీకాంత్ ను హీరోగా పెట్టి కబాలి సినిమా తీసింది ఇతడే. దర్శకుడు ఒకడే కావడం, నేపథ్యం కూడా దాదాపు ఒకటే అవ్వడంతో ఆ సినిమాకు కాలాకు చాలా పోలికలు కనిపిస్తున్నాయి. కబాలిలో స్టయిలిష్ డాన్ గా కనిపించిన రజనీ, కాలాలో మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే… కబాలి టైటిల్ సాంగ్ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దాదాపు ఒకటే.

ఏప్రిల్ 27న గ్రాండ్ గా విడుదలకానుంది కాలా సినిమా. వండర్ బార్ స్టుడియోస్ బ్యానర్ పై రజనీ అల్లుడు ధనుష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.