కాలా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Saturday,February 24,2018 - 03:10 by Z_CLU

రజనీకాంత్ అప్ కమింగ్ మూవీ కాలా సినిమాకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు టీజర్ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. మార్చి 1న అంటే మరో 5 రోజుల్లో కాలా టీజర్ రాబోతోంది.

మాఫియా డాన్ గా రజనీకాంత్ నటించిన సినిమా కాలా. గతంలో సూపర్ స్టార్ తో కబాలి సినిమాను తెరకెక్కించిన పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ అల్లుడు ధనుష్, తన సొంత ప్రొడక్షన్ కంపెనీపై నిర్మించిన చిత్రమిది.

రజనీ సరసన హుమా ఖురేషీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నానా పటేకర్ విలన్ గా కనిపించున్నారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 27న కాలా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదలకానుంది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు.