కాలా క్లోజింగ్ కలెక్షన్

Wednesday,June 20,2018 - 11:07 by Z_CLU

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా కాలా. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయింది. ఈనెల 7న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం మెయిన్ సెంటర్స్ తో పాటు మల్టీప్లెక్సుల్లో లేదు. సి-సెంటర్లలో అక్కడక్కడ ఆడుతున్నప్పటికీ, వసూళ్లపై ఆ ప్రభావం లేదు.

సో.. ఓవరాల్ గా చూసుకుంటే.. నిన్నటి వసూళ్లతో కలుపుకొని కాలాకు అటుఇటుగా 7 కోట్ల 35 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్ల రూపాయలకు కొన్నారు.

ఏపీ, నైజాం ఫైనల్ షేర్

నైజాం – రూ.2.89 కోట్లు
సీడెడ్ – రూ. 1.41 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.79 కోట్లు
ఈస్ట్ – రూ. 0.49 కోట్లు
వెస్ట్ – రూ. 0.39 కోట్లు
గుంటూరు – రూ. 0.75 కోట్లు
కృష్ణా – రూ. 0.50 కోట్లు
నెల్లూరు – రూ.28 కోట్లు