'కాలా' ఫస్ట్ లుక్ రిలీజయింది

Thursday,May 25,2017 - 06:09 by Z_CLU

టీవలే కబాలిసినిమాలో డాన్ గా ఎంటర్టైన్ చేసిన సూపర్ స్టార్ మరో సారి అలాంటి క్యారెక్టర్ లోనే ఎంటర్టైన్ చేయబోతున్నాడు. కబాలిదర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో తెరక్కెనున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో ను ఈ రోజు మార్నింగ్ రిలీజ్ చేసిన సినిమా యూనిట్ ముందుగానే అనౌన్స్ చేసినట్టు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది.

రోరింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో రిలీజ్ అయిన ఈ 2 ఫస్ట్ లుక్స్ తో ఆల్ రెడీ ఫుల్లీ లోడెడ్ ఎగ్జైట్ మెంట్ లో ఉన్న ఫ్యాన్స్  సంబరాలు చేసుకుంటున్నారు. కబాలి సినిమాలో మలేషియాలోని తమిళుల కోసం పోరాడి డాన్ గా మారతాడు రజనీకాంత్. తాజా మూవీ కాలాలో ముంబయిలో  తమిళులపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం సాగించే వ్యక్తిగా కనిపించనున్నాడు. 80ల్లో ముంబయిలో మాఫియా డాన్ గా చలామణి అయిన ఓ వ్యక్తి కథ ఆధారంగా కాలా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు.