K.V. గుహన్ ఇంటర్వ్యూ

Wednesday,March 06,2019 - 04:09 by Z_CLU

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ K.V. గుహన్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా 118. ఒకరోజు ఒక హోటల్ లో ఆగినప్పుడు తనకు వచ్చిన ఒక మిస్టీరియస్ డ్రీమ్ నుండే ఈ సినిమా కథ పుట్టింది అని చెప్పుకున్నాడు గుహన్. మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశాడు.

ఇది ఐడియాకి దక్కిన గౌరవం…

ఒక సినిమాటోగ్రాఫర్ గా నేను సక్సెస్ అయ్యాను. ఎపుడైతే డైరెక్షన్ చేయాలనుకున్నానో అప్పుడు కొత్త స్టోరీ ఉండాలనుకున్నా. చాలా ఐడియాస్ తట్టేవి కానీ ఎక్కడో, ఏదో సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయనిపించి ఆపేసేవాణ్ణి. ఈ ఐడియా జెన్యూన్ అనిపించింది. ఈ సక్సెస్ క్రెడిట్ ఐడియాకే.

ఇది నాకొచ్చిన కల…

నేనొకసారి ఒక హోటల్లో స్టే చేసినప్పుడు నాకు ఒక క్రైమ్ రిలేటెడ్ డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ నుండి బయటపడి కళ్ళు తెరిచి చూసేసరికి చాలా భయపడ్డా. తర్వాత ఇది డ్రీమే కదా అని రిలాక్సయ్య. ఆ తర్వాత కొన్ని రోజుల తరవాత మళ్ళీ అదే హోటల్, అదే రూమ్.. ఈ సారి గతంలో వచ్చిన డ్రీమ్ కి కంటిన్యుటీ… ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మెలకువ వచ్చాక ఆలోచనలో పడ్డా. దీన్నే మనం స్టోరీగా డెవెలప్ చేసుకుంటే బావుంటుంది కదా.. ఇప్పటి వరకు ఇలాంటి ఐడియా నేనెక్కడ చూడలేదు అనుకున్నా…

ఫస్ట్ నుండి అదే ఆలోచన…

కథ ప్రిపరేషన్ లో ఉన్నప్పటి నుండే నేను ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ అనుకున్నా. ఆయన కూడా కథ వినగానే చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు.

నాకు లిమిటేషన్స్ ఉన్నాయి…

డైరెక్టర్ గా నాకు లిమిటేషన్స్ ఉన్నాయి. నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్స్ చేయలేను. హెవీ బడ్జెట్ సినిమాలు చేసే స్థాయి ఇంకా నాకు రాలేదనే నా ఫీలింగ్.

సినిమాటోగ్రాఫర్ గా…

అల్టిమేట్ గా డైరెక్టర్ గానే చేయాలి అన్నదే నా కోర్. కాకపోతే ఒక కథ రెడీ అవడానికి టైమ్ పడుతూ ఉంటుంది కదా, ఈ గ్యాప్ లో సినిమాటోగ్రాఫర్ గా కూడా చేస్తుంటా….

నివేత థామస్…

నివేత థామస్ కి సినిమాలో స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా, సినిమా మొత్తం తన క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. చాలా ఇన్వాల్వ్ అయి చేసిందీ సినిమాని. సెట్స్ పై ఉన్నప్పుడు ప్రతి షాట్ కి ముందు డిస్కస్ చేసేది. డబ్బింగ్ కి వచ్చినప్పుడు కూడా, తనకు తోచిన కరెక్షన్స్ చెప్పేది. చాలా డెడికేటెడ్ యాక్ట్రెస్.

తెలుగుతో నా అనుబంధం…

సినిమాటోగ్రాఫర్ గా కూడా నేను ఎక్కువగా తెలుగు సినిమాలే చేశాను. నేను తమిళ సినిమా చేసేటప్పుడు కూడా నన్ను తెలుగు సినిమాటోగ్రాఫర్ గానే ట్రీట్ చేసేవారు. ‘118’ ఐడియా వచ్చినప్పుడు కూడా తెలుగులో చేయాలనే అనుకున్నాను కానీ, ఇంకో లాంగ్వేజ్ తట్టలేదు. ఫ్యూచర్ లో కూడా తెలుగు సినిమాలే చేస్తా.

ప్రొడ్యూసర్ నమ్మకం…

కళ్యాణ్ రామ్  గారు స్టోరీ వినగానే మహేష్ కోనేరు గారి దగ్గరికి పంపారు. ఆయన స్క్రిప్ట్ వినీ వినగానే ఆయన  ఇందులో దమ్ముందని నమ్మారు. ఆ నమ్మకమే ఈ రోజు నిజమైంది.

ఫ్యూచర్ సినిమాలు…

ఇంకా మంచి సినిమాలు చేస్తా. నెక్స్ట్ సినిమా ఈ సినిమా కన్నా కొంచెం కమర్షియల్ డోస్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటా…