ఝాన్సీగా వస్తున్న జ్యోతిక

Saturday,July 14,2018 - 03:28 by Z_CLU

స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల ద‌ర్శ‌క‌త్వంలో, సొంత నిర్మాణంలో తెర‌కెక్కించిన  మూవీ నాచియార్. ఈ చిత్రాన్ని తెలుగు లో డి వెంకటేష్ డి వి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై విడుదల కానుంది.  త‌మిళనాట రిలీజ్ అయి విశేష ప్రేక్ష‌క ఆదర‌ణ పొందిన చిత్రంగా, ప‌లు రికార్డ్ ల‌ను క్రియేట్ చేసింది. క్రైమ్ డ్రామాగా వ‌చ్చిన ఈ చిత్రంలో విభిన్న పాత్ర‌ల‌తో త‌న‌దైన న‌ట‌న‌, అభిన‌యంతో క‌థ‌ను ర‌క్తిక‌ట్టించ‌గ‌ల స్టార్ హీరోయిన్ జ్యోతిక‌, పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో నటించింది. ఈ చిత్రాని తెలుగు లో ఝాన్సీ పేరుతో విడుదల చేస్తున్నారు.

మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే…త‌న స్వ‌రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్ధుల‌న్ని చేసే మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం…ఈ మూవీ స‌క్సెస్ కి ప్ర‌ధాన కార‌ణమైంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కుల్ని డి వెంకటేష్ దక్కించుకున్నారు. డి వీ సినీ క్రియేషన్స్ మరియు కల్పనా చిత్ర బ్యానర్ వారు సంయుక్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి యశ్వంత్ మూవీస్  సమర్పకులు.

త్వ‌ర‌లోనే ఈ చిత్రం యొక్క టీజ‌ర్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.  జ్యోతిక చాలా రోజులు త‌రువాత తెలుగులో వ‌స్తుండ‌టం అనేది  తెలుగు మార్కెట్ లో ఈ మూవీకి ఎంతో ప్ల‌స్ గా ఉంది.