ఆగష్టు 3న జ్యోతిక 'ఝాన్సీ'

Sunday,July 29,2018 - 11:30 by Z_CLU

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన ‘నాచియార్’ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో విడుదలవుతుంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ఆగస్ట్ ౩న విడుదల చేయబోతున్నారు మేకర్స్.

జ్యోతిక పవర్ ఫుల్ పోలిస్ రోల్ లో నటించిన ఈ సినిమాకు బాల దర్శకుడు. తెలుగు లో  కోనేరు కల్పన మరియు  డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ ద్వారా సంయుక్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో జి వి ప్రకాష్  కీలక పాత్రలో నటించాడు.

ఈ సందర్భంగా నిర్మాతలు కోనేరు కల్పన మాట్లాడుతూ “నాచియార్ చిత్రం తమిళం లో ఘానా విజయం సాధించింది. స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల స్వయ దర్శకత్వం నిర్మించబడిన ఈ చిత్రం తెలుగు హక్కులు మాకు దక్కటం చాల సంతోషం గా ఉంది. బాల గారి అద్భుతమైన దర్శకత్వం ఒక్క ఎత్తు అయితే జ్యోతిక గారి నటన మరో ఎత్తు. వీరి ఇద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా తమిళనాడు అంతటా విజయవంతం గా ప్రదర్శింపబడినది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు లో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఆగష్టు 3నా విడుదల కు సిద్ధం గా ఉంది. తమిళం లో ఎంతో  విజయం సాధించిన ఈ సినిమా పై తెలుగు లో అంచనాలు భారీగా ఉన్నాయ్. బయర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ ల దగ్గర నుంచి మంచి ఆఫర్ వస్తుంది. తెలుగు లో కూడా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది” అని తెలిపారు.